Lokesh

Mattiloni chettu

మట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉన్నచోటనే ఉంటాం
ఉట్టి నేల మీది ఓడ నెక్కి ఒడ్డుకెళ్ళమంటాం
వాస్తవాలు చూసిచూడనట్టు కళ్ళు మూసుకుంటాం
బొటన వేలితో నొసటి రాతలు చదువుతుంటాం
ఇదొక నిత్య నరకం అని నిందించి ఏం లాభం
సగటు మనిషి లోకం ఈ త్రిశంకు స్వర్గం
దాన్ని బొందితోనే అందుకున్నామని సంతోషిద్దాం
మట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉన్నచోటనే ఉంటాం
ఉట్టి నేల మీది ఓడ నెక్కి ఒడ్డుకెళ్ళమంటాం

ఎప్పటికప్పుడు వేరే కొత్త కథలు చెప్పమందాం
భేతాళుడి మోతైతే బ్రతుకు ప్రయాణం
ఎక్కడికక్కడ సరేలే అని సర్దుకుపోయే తత్వం
తలకెక్కిందంటే ఇక తెలియదు భారం
ఫక్కుమనకంటూ దు:ఖమడ్డుపడితే
వెక్కివెక్కి నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటే
విసుగెత్తి మనని విడిచిపోదా విషాదం
మట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉన్నచోటనే ఉంటాం
ఉట్టి నేల మీది ఓడ నెక్కి ఒడ్డుకెళ్ళమంటాం

సుక్కలు లెక్కలు పెడుతూ మన చిక్కులు పోల్చుకుందాం
తక్కువే కదా అని తేలిక పడదాం
ఆస్తులు లేకపోతేనేం అప్పులు ఉన్నవాళ్ళం
అసలు లేని వాళ్ళ కన్నా నయమనుకుందాం
పస్తులనుకుంటే పరువుకి కష్టం
ఉపవాసముంటే ఏమిటంట నష్టం
మన ఆశకన్న ఆకలేమి ఎక్కువా

మట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉన్నచోటనే ఉంటాం
ఉట్టి నేల మీది ఓడ నెక్కి ఒడ్డుకెళ్ళమంటాం
ఇదొక నిత్య నరకం అని నిందించి ఏం లాభంభం భంభం
సగటు మనిషి లోకం ఈ త్రిశంకు స్వర్గం
దాన్ని బొందితోనే అందుకున్నామని సంతోషిద్దాం
మట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉన్నచోటనే ఉంటాం
ఉట్టి నేల మీది ఓడ నెక్కి ఒడ్డుకెళ్ళమంటాంmaTTilOni cheTTu vELLalAga unnachOTanE uMTAM
uTTi nEla mIdi ODa nekki oDDukeLLamaMTAM
vAstavAlu chUsichUDanaTTu kaLLu mUsukuMTAM
boTana vElitO nosaTi rAtalu chaduvutuMTAM
idoka nitya narakaM ani niMdiMchi EM lAbhaM
sagaTu manishi lOkaM I triSaMku svargaM
dAnni boMditOnE aMdukunnAmani saMtOshiddAM
maTTilOni cheTTu vELLalAga unnachOTanE uMTAM
uTTi nEla mIdi ODa nekki oDDukeLLamaMTAM

eppaTikappuDu vErE kotta kathalu cheppamaMdAM
bhEtALuDi mOtaitE bratuku prayANaM
ekkaDikakkaDa sarElE ani sardukupOyE tatvaM
talakekkiMdaMTE ika teliyadu bhAraM
phakkumanakaMTU du:khamaDDupaDitE
vekkivekki navvutU kaLLu tuDuchukuMTE
visugetti manani viDichipOdA vishAdaM
maTTilOni cheTTu vELLalAga unnachOTanE uMTAM
uTTi nEla mIdi ODa nekki oDDukeLLamaMTAM

sukkalu lekkalu peDutU mana chikkulu pOlchukuMdAM
takkuvE kadA ani tElika paDadAM
Astulu lEkapOtEnEM appulu unnavALLaM
asalu lEni vALLa kannA nayamanukuMdAM
pastulanukuMTE paruvuki kashTaM
upavAsamuMTE EmiTaMTa nashTaM
mana ASakanna AkalEmi ekkuvA

maTTilOni cheTTu vELLalAga unnachOTanE uMTAM
uTTi nEla mIdi ODa nekki oDDukeLLamaMTAM
idoka nitya narakaM ani niMdiMchi EM lAbhaMbhaM bhaMbhaM
sagaTu manishi lOkaM I triSaMku svargaM
dAnni boMditOnE aMdukunnAmani saMtOshiddAM
maTTilOni cheTTu vELLalAga unnachOTanE uMTAM
uTTi nEla mIdi ODa nekki oDDukeLLamaMTAMEndhaka nee payanam

ఎందాకా నీ పయనం దరిచేరని ఈ చలనం
అంటే ఎమంటుందో గాలిపటం
చెప్పదుగా ఏ వివరం గగనంలో సంచారం
ఉందా ఉందనుకుందాం ఓ గమ్యం
ఆగేందుకు వీలుందా ఆ వేగంలో
సాగేందుకు దారుందా ఆకాశంలో
బదులేదైనా చెబుతుందా ఏకాంతం
ఎందాకా నీ పయనం దరిచేరని ఈ చలనం
అంటే ఎమంటుందో గాలిపటం

వేడుకేదో వేదన ఏదో అర్థమవని ఆరాటం
వెన్ను తట్టి చూపిస్తుందా తగు బాట
ముచ్చటేదో ముచ్చెమటేదో పోల్చలేని పోరాటాం
ఒక్క క్షణం ఆపేస్తుందా తన వేట
అల్లి బిల్లి ఆశలతో అతికిన ఆకారంతో
ఊసుపోని ఊహలతో నింపిన పెను భారంతో
మింటిపైకి తన ఎగరేసిందెవరో ఎపుడో
ఎందాకా నీ పయనం దరిచేరని ఈ చలనం
అంటే ఎమంటుందో గాలిపటం

తలకిందులైపోతున్నా తప్పని తన విన్యాసం
కళ్ళవిందుగా చూస్తారే జనమంతా
ఓడి ఓడి ఓటామినైనా విసిగించే తన సహనం
గెలిచినట్టు భావిస్తారే ఎంత వింత
తనకి ఉన్న తోడొకటే సన్ననైన ఆధారం
నమ్ముకున్న అది తెగితే ఏది తనకి ఆధారం
ఏనాడూ కంచికి చేరక తిరిగే కథగా

ఎందాకా నీ పయనం దరిచేరని ఈ చలనం
అంటే ఎమంటుందో గాలిపటం
ఆగేందుకు వీలుందా ఆ వేగంలో
సాగేందుకు దారుందా ఆకాశంలో
బదులేదైనా చెబుతుందా ఏకాంతం
ఎందాకా నీ పయనం దరిచేరని ఈ చలనం
అంటే ఎమంటుందో గాలిపటంeMdAkA nI payanaM darichErani I chalanaM
aMTE emaMTuMdO gAlipaTaM
cheppadugA E vivaraM gaganaMlO saMchAraM
uMdA uMdanukuMdAM O gamyaM
AgEMduku vIluMdA A vEgaMlO
sAgEMduku dAruMdA AkASaMlO
badulEdainA chebutuMdA EkAMtaM
eMdAkA nI payanaM darichErani I chalanaM
aMTE emaMTuMdO gAlipaTaM

vEDukEdO vEdana EdO arthamavani ArATaM
vennu taTTi chUpistuMdA tagu bATa
muchchaTEdO muchchemaTEdO pOlchalEni pOrATAM
okka kshaNaM ApEstuMdA tana vETa
alli billi ASalatO atikina AkAraMtO
UsupOni UhalatO niMpina penu bhAraMtO
miMTipaiki tana egarEsiMdevarO epuDO
eMdAkA nI payanaM darichErani I chalanaM
aMTE emaMTuMdO gAlipaTaM

talakiMdulaipOtunnA tappani tana vinyAsaM
kaLLaviMdugA chUstArE janamaMtA
ODi ODi OTAminainA visigiMchE tana sahanaM
gelichinaTTu bhAvistArE eMta viMta
tanaki unna tODokaTE sannanaina AdhAraM
nammukunna adi tegitE Edi tanaki AdhAraM
EnADU kaMchiki chEraka tirigE kathagA

eMdAkA nI payanaM darichErani I chalanaM
aMTE emaMTuMdO gAlipaTaM
AgEMduku vIluMdA A vEgaMlO
sAgEMduku dAruMdA AkASaMlO
badulEdainA chebutuMdA EkAMtaM
eMdAkA nI payanaM darichErani I chalanaM
aMTE emaMTuMdO gAlipaTaM


Gayam thagili aratamtho

గాయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి
పొందిందేదో పోయిందేదో తెలుసా
దాహం తీర్చే స్నేహంతో ఓ చినుకే చిలికి
చల్లగ నిమిరే మబ్బుకి మాత్రం తెలుసా
కీడు జరిగిందో తోడు దొరికిందో
బరువు దించిందో ఇంకా పెంచిందో ఇంత ఋణం
గాయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి
పొందిందేదో పోయిందేదో తెలుసా

బంతల్లే ప్రతి చోట తంతుందేం బ్రతుకాట
అణిచేందుక్కొడుతుందో గెలిచే వైపే నెడుతుందో
పడగొట్టందే చూపదు ఎమో ఏ బాట
చెంతనే ఉందని చెలిమందించే చెయ్యూత
కన్నులనే పొడిచిందా కన్నీళ్ళను తుడిచిందా
ఓ వెన్నెల మరకై కనిపించే ఈ తరుణం
గాయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి
పొందిందేదో పోయిందేదో తెలుసా

ఏ పూటకి అ పూట తెరిపించే కొత్త పుట
అనుకున్నది తప్పందా వేరే మలుపును తిప్పిందా
సూర్యుడు చూడని సంగతులెన్నో కలవందా
కమ్ముకు వచ్చిన చీకటికే అవి తెలుసందా
కలలన్నీ తుంచిందా మెలుకువ రప్పించిందా
నడిరాతిరిలోనే ఎదురయ్యే ఈ ఉదయం

గాయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి
పొందిందేదో పోయిందేదో తెలుసా
కీడు జరిగిందో తోడు దొరికిందో
బరువు దించిందో ఇంకా పెంచిందో ఈ స్నేహం
గాయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి
పొందిందేదో పోయిందేదో తెలుసాgAyaM tagili ArATaMtO tirigE madiki
poMdiMdEdO pOyiMdEdO telusA
dAhaM tIrchE snEhaMtO O chinukE chiliki
challaga nimirE mabbuki mAtraM telusA
kIDu jarigiMdO tODu dorikiMdO
baruvu diMchiMdO iMkA peMchiMdO iMta RNaM
gAyaM tagili ArATaMtO tirigE madiki
poMdiMdEdO pOyiMdEdO telusA

baMtallE prati chOTa taMtuMdEM bratukATa
aNichEMdukkoDutuMdO gelichE vaipE neDutuMdO
paDagoTTaMdE chUpadu emO E bATa
cheMtanE uMdani chelimaMdiMchE cheyyUta
kannulanE poDichiMdA kannILLanu tuDichiMdA
O vennela marakai kanipiMchE I taruNaM
gAyaM tagili ArATaMtO tirigE madiki
poMdiMdEdO pOyiMdEdO telusA

E pUTaki a pUTa teripiMchE kotta puTa
anukunnadi tappaMdA vErE malupunu tippiMdA
sUryuDu chUDani saMgatulennO kalavaMdA
kammuku vachchina chIkaTikE avi telusaMdA
kalalannI tuMchiMdA melukuva rappiMchiMdA
naDirAtirilOnE edurayyE I udayaM

gAyaM tagili ArATaMtO tirigE madiki
poMdiMdEdO pOyiMdEdO telusA
kIDu jarigiMdO tODu dorikiMdO
baruvu diMchiMdO iMkA peMchiMdO I snEhaM
gAyaM tagili ArATaMtO tirigE madiki
poMdiMdEdO pOyiMdEdO telusAChitti chitti aduga

చిట్టి చిట్టి అడుగా.. జింకల పరుగా..
నీ వెంట పడి అడిగా అందను అనక ఆగమ్మా
కొన్ని ఏళ్ళ వెనుక.. నిను చూసినట్టుగా..
నా చిన్నతనము ఏం గుర్తులేదని అనకమ్మా
నా ఆకారం మారిందనుకో
నా దరహాసం మాసిందనుకో
ఏ ఆనవాలు మిగలలేదా బొత్తిగా
హే పంచదార చిలకా.. బంగరు కణికా.. కిలకిలల కానుకా..
చిట్టి చిట్టి అడుగా.. జింకల పరుగా..

బుడి బుడి నడక వెనక తడబడి వెళ్ళినాక
ఎదిగిన ఏళ్ళకింక లేదని దీని మునక
తువ్వాయి లాగ తుళ్ళేదెలాగ
పాపాయి లాగ పలికేదెలాగ
పాపలా నవ్వినా పాపలా ఏడ్చినా
వాళ్ళలా చెయ్యడం మనకదేం తేలిక
చిన్నారుల్లో గెలవాలంటే
మనికీవేళ వాళ్ళంత వయసు ఉండాలిగా
చిట్టి చిట్టి అడుగా.. జింకల పరుగా..
నీ వెంట పడి అడిగా అందను అనక ఆగమ్మా
కొన్నిఏళ్ళ వెనుక.. నిను చూసినట్టుగా..
నా చిన్నతనము ఏం గుర్తులేదని అనకమ్మా

విచ్చిన నెమలి పించం పిల్లల ఈ ప్రపంచం
చెరగని వర్ణ చిత్రం చెదరని స్వర్ణ స్వప్నం
చిగురాకు వేలు చిటికేస్తే చాలు
జింకల్లే వాలు జిలుగుల చుక్క పూలు
అన్నిటా అంతటా అబ్బురం అద్భుతం
పాతగా ఉండదే ఏ దినం ఏ క్షణం
మననా లోకం వెలివేసిందా
అరుదైన ఆ వరం చెయ్యి జారిపోయిందా

చిట్టి చిట్టి అడుగా.. జింకల పరుగా..
నీ వెంట పడి అడిగా అందను అనక ఆగమ్మా
కొన్నిఏళ్ళ వెనుక.. నిను చూసినట్టుగా..
నా చిన్నతనము ఏం గుర్తులేదని అనకమ్మా
నా ఆకారం మారిందనుకో
నా దరహాసం మాసిందనుకో
ఏ ఆనవాలు మిగలలేదా బొత్తిగా
హే పంచదార చిలకా.. బంగరు కణికా.. కిలకిలల కానుకా..


chiTTi chiTTi aDugA.. jiMkala parugA..
nI veMTa paDi aDigA aMdanu anaka AgammA
konni ELLa venuka.. ninu chUsinaTTugA..
nA chinnatanamu EM gurtulEdani anakammA
nA AkAraM mAriMdanukO
nA darahAsaM mAsiMdanukO
E AnavAlu migalalEdA bottigA
hE paMchadAra chilakA.. baMgaru kaNikA.. kilakilala kAnukA..
chiTTi chiTTi aDugA.. jiMkala parugA..

buDi buDi naDaka venaka taDabaDi veLLinAka
edigina ELLakiMka lEdani dIni munaka
tuvvAyi lAga tuLLEdelAga
pApAyi lAga palikEdelAga
pApalA navvinA pApalA EDchinA
vALLalA cheyyaDaM manakadEM tElika
chinnArullO gelavAlaMTE
manikIvELa vALLaMta vayasu uMDAligA
chiTTi chiTTi aDugA.. jiMkala parugA..
nI veMTa paDi aDigA aMdanu anaka AgammA
konniELLa venuka.. ninu chUsinaTTugA..
nA chinnatanamu EM gurtulEdani anakammA

vichchina nemali piMchaM pillala I prapaMchaM
cheragani varNa chitraM chedarani svarNa svapnaM
chigurAku vElu chiTikEstE chAlu
jiMkallE vAlu jilugula chukka pUlu
anniTA aMtaTA abburaM adbhutaM
pAtagA uMDadE E dinaM E kshaNaM
mananA lOkaM velivEsiMdA
arudaina A varaM cheyyi jAripOyiMdA

chiTTi chiTTi aDugA.. jiMkala parugA..
nI veMTa paDi aDigA aMdanu anaka AgammA
konniELLa venuka.. ninu chUsinaTTugA..
nA chinnatanamu EM gurtulEdani anakammA
nA AkAraM mAriMdanukO
nA darahAsaM mAsiMdanukO
E AnavAlu migalalEdA bottigA
hE paMchadAra chilakA.. baMgaru kaNikA.. kilakilala kAnukA..Nene nanine

నేనే నానినే... నే నీ నానినే... పోనే పోనీనే నీడై ఉన్నానే...
అరె అరె అరె అరె... ఓ... అరె అరె అరె అరె... ఓ...
కళ్లకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి
గాలిని తేలుతు ఉంటున్నానే
అరె అరె అరె అరె... ఓ... అరె అరె అరె అరె... ఓ...
కనబడినా ఓకె... కనుమరుగవుతున్నా ఓకె...
కనబడినా ఓకె... కనుమరుగవుతున్నా ఓకె...
అరె అరె అరె అరె... ఓ... అరె అరె అరె అరె... ఓ...

మాటల్లో ముత్యాలే దాచేసినా చిరునవ్వు కాస్తైనా ఒలికించవా
కోపం అయినా కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ
కనబడినా ఓకె... కనుమరుగవుతున్నా ఓకె...
కనబడినా ఓకె... కనుమరుగవుతున్నా ఓకె...
అరె అరె అరె అరె... ఓ... అరె అరె అరె అరె... ఓ...

నా భాషలో రెండే వర్ణాలనీ నాకింక నీ పేరే జపమౌననీ
బిందు అంటే గుండె ఆగి దిక్కులన్నీ చూడనా
కనబడినా ఓకె... కనుమరుగవుతున్నా ఓకె...
కనబడినా ఓకె... కనుమరుగవుతున్నా ఓకె...
అరె అరె అరె అరె... ఓ... అరె అరె అరె అరె... ఓ...


nEnE nAninE... nE nI nAninE... pOnE pOnInE nIDai unnAnE...
are are are are... O... are are are are... O...
kaLlaku ottulu veligiMchi kalalaku rekkalu toDigiMchi
gAlini tElutu uMTunnAnE
are are are are... O... are are are are... O...
kanabaDinA Oke... kanumarugavutunnA Oke...
kanabaDinA Oke... kanumarugavutunnA Oke...
are are are are... O... are are are are... O...

mATallO mutyAlE dAchEsinA chirunavvu kAstainA olikiMchavA
kOpaM ayinA kOrukunnA annI nAku nuvvanI
kanabaDinA Oke... kanumarugavutunnA Oke...
kanabaDinA Oke... kanumarugavutunnA Oke...
are are are are... O... are are are are... O...

nA bhAshalO reMDE varNAlanI nAkiMka nI pErE japamaunanI
biMdu aMTE guMDe Agi dikkulannI chUDanA
kanabaDinA Oke... kanumarugavutunnA Oke...
kanabaDinA Oke... kanumarugavutunnA Oke...
are are are are... O... are are are are... O...Konchemu konchemu

కొంచెము అర్థమయినా కొంచెము కొంచెము కాకపోయినా
కొంచెము బెట్టు చూపినా కొంచెము కొంచెము గుట్టు విప్పినా
కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా...హో..
నీ గుండె లోతున భూతద్దమేయనా
ఏదో మూలన నన్నే చూడనా
నీ గుండె లోతున భూతద్దమేయనా
ఏదో మూలన నన్నే చూడనా

కొంచెము చూడవచ్చుగా కొంతైనా మాట్లాడవచ్చుగా
పోనీ అలగవచ్చుగా పొగడాలంటే అడగవచ్చుగా
నీకై మెల్ల మెల్లగా పిచ్చోడ్నౌతున్నా జాలి పడవుగా...హో..
పిసనారి నారివే పిసరంత పలకవే
ఆ కంచె తెంచవే ఇవ్వాలైనా
పిసనారి నారివే పిసరంత పలకవే
ఆ కంచె తెంచవే ఇవ్వాలైనా

కాకితో కబురు పంపినా కాదనకుండా వచ్చి వాలనా
రెక్కలు లేకపోయినా చుక్కలకే నిను తీసుకెళ్లనా
జన్మలు ఎన్ని మారినా. ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరనా...హో..
నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా
what did you say?
నీ గుండె గూటిలో.. నా గుండె హాయిగా... తల దాచుకుందని... తెలియలేదా..koMchemu arthamayinA koMchemu koMchemu kAkapOyinA
koMchemu beTTu chUpinA koMchemu koMchemu guTTu vippinA
koMchemu kasurukunnA mari koMchemu koMchemu kosari navvinA...hO..
nI guMDe lOtuna bhUtaddamEyanA
EdO mUlana nannE chUDanA
nI guMDe lOtuna bhUtaddamEyanA
EdO mUlana nannE chUDanA

koMchemu chUDavachchugA koMtainA mATlADavachchugA
pOnI alagavachchugA pogaDAlaMTE aDagavachchugA
nIkai mella mellagA pichchODnautunnA jAli paDavugA...hO..
pisanAri nArivE pisaraMta palakavE
A kaMche teMchavE ivvAlainA
pisanAri nArivE pisaraMta palakavE
A kaMche teMchavE ivvAlainA

kAkitO kaburu paMpinA kAdanakuMDA vachchi vAlanA
rekkalu lEkapOyinA chukkalakE ninu tIsukeLlanA
janmalu enni mArinA. prati janmalO jaMTagA ninnu chEranA...hO..
nI guMDe gUTilO nA guMDe hAyigA taladAchukuMdani teliyalEdA
what did you say?
nI guMDe gUTilO.. nA guMDe hAyigA... tala dAchukuMdani... teliyalEdA..
Lava lava

లావా లావా లావా గుండెలో లావా
వెన్నెల్లో మరిగే valceno నువ్వా
ఉప్పెనలా ఊపిరిలోకి తుఫానై కౌగిళ్లోకి వస్తావా చంపేస్తావా
లావా లావా లావా గుండెలో లావా
వెన్నెల్లో మరిగే valceno నువ్వా
లావా లావా లావా గుండెలో లావా
వెన్నెల్లో మరిగే valceno నువ్వా

అందంతో మింగేసే రాకాసి
చూపుల్తో నా ఒళ్ళే కోసేసేయ్
ఊరించి ఉరితీసి నా సొంతం అవుతావా
లావా లావా లావా గుండెలో లావా
వెన్నెల్లో మరిగే valceno నువ్వా
లావా లావా లావా గుండెలో లావా
వెన్నెల్లో మరిగే valceno నువ్వాlaavaa laavaa laavaa guMDelO laavaa
vennellO marigae valceno nuvvaa
uppenalaa oopirilOki tuphaanai kaugiLlOki vastaavaa chaMpaestaavaa
laavaa laavaa laavaa guMDelO laavaa
vennellO marigae valceno nuvvaa
laavaa laavaa laavaa guMDelO laavaa
vennellO marigae valceno nuvvaa

aMdaMtO miMgaesae raakaasi
choopultO naa oLLae kOsaesaey
ooriMchi uriteesi naa soMtaM avutaavaa
laavaa laavaa laavaa guMDelO laavaa
vennellO marigae valceno nuvvaa
laavaa laavaa laavaa guMDelO laavaa
vennellO marigae valceno nuvvaaMy name is nani

దేఖ్‌లోరె సాలా యే రాత్ చాగయి
తేరే ద్వార్ పె తేరే మౌత్ ఆగయీగ..ఈగ..ఈగ..ఈగ.....
my name is nani నేనీగనైతే కాని
నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ని
my name is nani నేనీగనైతే కాని
నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ని
నీ రేంజ్ పెద్దదవనీ నా సైజ్ చిన్నదవనీ
నీ కింగ్‌డంనే కూల్చకుంటే కానురా మగాన్ని
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా

అణువంతే ఉన్నా అగ్గిరవ్వలోన
అడవినైనా కాల్చే కసి నిప్పు దాగి లేదా
చిటికంతే అయినా చినుకు బొట్టులోన
పుడమినైనా ముంచే పెను ముప్పు పొంచిలేదా
listen the universe is an atom before the bigbang
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని యమ కేర్‌ఫ్రీగా నువ్వు ఆవలించేలోగా
నీ శ్వాసలోన దూరిపోనా బయో వైరస్ లాగా...ఆ..ఆ...
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా

యమ అర్జంటుగా పూర్తిచెయ్యవలసిన పనులున్నాయ్
పదే పది.. పదే పది..
వన్.. నిన్ను చంపడం టూ.. నిన్ను చంపడం త్రీ.. నిన్ను చంపడం
ఫోర్.. నిన్ను చంపడం ఫైవ్.. నిన్ను చంపడం సిక్స్.. నిన్ను చంపడం
సెవెన్.. నిన్ను చంపడం ఎయిట్.. నిన్ను చంపడం నైన్.. నిన్ను చంపడం
టెన్.. నిన్ను ముసిరి ముసిరి ముసిరి ముసిరి తరిమి తరిమి తరిమి తరిమి పొడిచి పొడిచి పొడిచి చంపడం
రెపరెపరెపరెప రెక్కలను విదిలిస్తాగా
నీ చెవ్వుల్లోన మరణ రాగ వినిపిస్తాగా
సూసైడ్ బాంబర్‌నై నీ పైకి దూసుకొస్తా
by hook or crook నిన్ను చంపి మరోసారి చస్తా
ఒక్కసారి చచ్చినాక ఇంకో చావు లెక్కా
ఇల్లలికే ఈగ యే ముఝే క్యా కరేగా
అని ఆలోచించేలోగా నీ ఆయువున్న జాగా
తగిలిబెట్టి ఎగిరిపోనా తారాజువ్వ లాగా...ఆ..ఆ...
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగా
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీగా తేరే జాన్ లేగాdEkhlOre sAlA yE rAt chaagayi
tErE dwaar pe tErE mout AgayIga..Iga..Iga..Iga.....
my name is nani nEnIganaitE kAni
nI gunDellO pElanunna nyUkliyar missailni
my name is nani nEnIganaitE kAni
nI gunDellO pElanunna nyUkliyar missailni
nI rEnj peddadavanI nA saij chinnadavanI
nI kingDomnE kUlchakunTE kAnurA magAnni
Iga Iga Iga yamuDi merupu tIga
IjI IjI IjIgA tErE jAn lEgA
Iga Iga Iga yamuDi merupu tIga
IjI IjI IjIgA tErE jAn lEgA

aNuvantE unnA aggiravvalOna
aDavinainA kAlchE kasi nippu dAgi lEdA
chiTikantE ayinA chinuku boTTulOna
puDaminainA munchE penu muppu ponchilEdA
listen the universe is an atom before the bigbang
illalikE Iga yE mujhE kyA karEgA
ani yama care freegA nuvvu AvalinchElOgA
nI SwAsalOna dUripOnA bayO vairas lAgA...A..A...
Iga Iga Iga yamuDi merupu tIga
IjI IjI IjIgA tErE jAn lEgA
Iga Iga Iga yamuDi merupu tIga
IjI IjI IjIgA tErE jAn lEgA

yama arjanTugA pUrticeyyavalasina panulunnAy
padE padi.. padE padi..
one.. ninnu champaDam two.. ninnu champaDam three.. ninnu champaDam
four.. ninnu champaDam five.. ninnu champaDam six.. ninnu champaDam
seven.. ninnu champaDam eight.. ninnu champaDam nine.. ninnu champaDam
Ten.. ninnu musiri musiri musiri musiri tarimi tarimi tarimi tarimi poDichi poDichi poDichi champaDam
reparepareparepa rekkalanu vidilistAgA
nI chevvullOna maraNa rAga vinipistAgA
suicide bombernai nI paiki dUsukostA
by hook or crook ninnu champi marOsAri chastA
okkasAri chacchinAka inkO cAvu lekkA
illalikE Iga yE mujhE kyA karEgA
ani AlOchinchElOgA nI Ayuvunna jAgA
tagilibeTTi egiripOnA tArAjuvva lAgA...A..A...
Iga Iga Iga yamuDi merupu tIga
IjI IjI IjIgA tErE jAn lEgA
Iga Iga Iga yamuDi merupu tIga
IjI IjI IjIgA tErE jAn lEgA