Lokesh

sadiseyako gali

సడిసేయకో గాలి సడిసేయబోకే
సడిసేయకో గాలి సడిసేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిసేయకే

రత్నపీఠిక లేని రారాజు ణా స్వామి
మణి కీరీటము లేని మహరాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే
సడిసేయకే

ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూసేనే
నిదుర చెదిరిందంటే నేనూరుకోనే
సడిసేయకే

పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవనమూని విసిరి పోరాదే

సడిసేయకో గాలి సడిసేయబోకే
బడలి ఒడిలో రాజు పవళించేనే
సడిసేయకో గాలి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఉమ్..ఉమ్..ఉమ్..ఉమ్..ఉమ్..


saDisEyakO gAli saDisEyabOkE
saDisEyakO gAli saDisEyabOkE
baDali oDilO rAju pavaLiMchEnE
saDisEyakE
ratnapIThika lEni rArAju NA svAmi
maNi kIrITamu lEni maharAju gAkEmi
chilipi parugula mAni kolichi pOrAdE
saDisEyakE
ETi galagalalakE egasi lEchEnE
Aku kadalikalakE adari chUsEnE
nidura chediriMdaMTE nEnUrukOnE
saDisEyakE
paMDu vennelanaDigi pAnpu tErAdE
nIDa mabbula dAgu nidura tErAdE
virula vIvanamUni visiri pOrAdE
saDisEyakO gAli saDisEyabOkE
baDali oDilO rAju pavaLiMchEnE
saDisEyakO gAli
A..A..A..A..A..A..A..
um..um..um..um..um..




0 comments: